Ishan Kishan Love Story: ఇషాన్ కిషన్ లవ్ స్టోరీ.. ఎవరీ మోడల్ అదితి, ఎక్కడ-ఎప్పుడు పరిచయం?

Ishan Kishan Love Story: 27 ఏళ్ల టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ ఏడాదే మోడల్ అదితి హుందియాతో పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కిషన్, అదితి మధ్య పరిచయం ఎలా అయింది అని అభిమానులు చర్చిస్తున్నారు.

Update: 2026-03-10 12:02 GMT

Ishan Kishan Love Story: ఇషాన్ కిషన్ లవ్ స్టోరీ.. ఎవరీ మోడల్ అదితి, ఎక్కడ-ఎప్పుడు పరిచయం?

Ishan Kishan Love Story: టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డేటింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా కిషన్‌ పెళ్లి గురించి అతడి తాతయ్య రామ్‌ అనురాగ్‌ పాండే హింట్‌ కూడా ఇచ్చారు. కిషన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, టీ20 ప్రపంచ కప్‌ తర్వాత మోడల్ అదితి హుందియాతో పెళ్లి చేస్తామని వెల్లడించారు. 27 ఏళ్ల కిషన్ ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కిషన్, అదితి మధ్య పరిచయం ఎలా అయింది అని అభిమానులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి పరిచయం ఎలా జరిగిందో చూద్దాం.

ఐపీఎల్ 2019 సమయంలో ఇషాన్ కిషన్, అదితి హుందియా మధ్య పరిచయం మొదలైందని తెలుస్తోంది. ఆ సమయంలో కిషన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే సమయంలో స్టేడియంలో మ్యాచ్‌లు చూడడానికి వచ్చిన ఆదితి అతనికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు లైక్‌లు, కామెంట్లు చేయడం అభిమానుల కంట పడింది. కాలక్రమేణా వీరి మధ్య స్నేహం మరింత పెరిగి ప్రేమగా మారింది. అయితే తమ బంధాన్ని ఈ జంట ప్రైవేట్‌గా ఉంచింది. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా కొనసాగించారు. 2025 జూలైలో ఇషాన్ వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సమయంలో అతని పుట్టినరోజు సందర్భంగా ఆదితి అక్కడికి వెళ్లి అతనికి సర్ప్రైజ్ ఇచ్చారు. 2026 ఫిబ్రవరిలో కిషన్ తాత.. ఆదితి అతని గర్ల్‌ఫ్రెండ్ అని ధృవీకరించారు. భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచాక మైదానంలో ఇషాన్‌తో కలిసి ఆదితి సంబరాలు చేసుకున్నారు. దాంతో కిషన్, ఆదితి డేటింగ్ కన్ఫర్మ్ అయింది.

అదితి హుందియా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మోడల్. ఆమె 2017లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. తరువాత 2018లో మిస్ దివా సుప్రానేషనల్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. జైపూర్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఆమె బీబీఏ డిగ్రీ పూర్తి చేసింది. ఆదితి మోడలింగ్ మరియు ఫ్యాషన్ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జైపుర్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అదితి. 29 ఏళ్ల అదితి పేరు మీద ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ కూడా ఉంది. అదితి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మరోవైపు కిషన్ క్రికెట్‌లో తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. కిషన్ ఇప్పటివరకు భారత్ తరఫున 2 టెస్టులు, 27 వన్డేలు, 45 టీ20లు ఆడాడు.

Tags:    

Similar News