Most IPL Matches: ఎన్నో మ్యాచ్‌లు ఆడినా ఐపీఎల్‌ టైటిల్ రుచి చూడని స్టార్‌లు.. ఈసారి సంజు అదృష్టం మారేనా?

Most IPL Matches: కొంతమంది ఆటగాళ్లు ఎన్నో మ్యాచ్‌లు ఆడినా.. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఈ జాబితాలో చాలా స్టార్ ప్లేయర్స్ పేర్లు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Update: 2026-03-15 14:49 GMT

Most IPL Matches: ఎన్నో మ్యాచ్‌లు ఆడినా ఐపీఎల్‌ టైటిల్ రుచి చూడని స్టార్‌లు.. ఈసారి సంజు అదృష్టం మారేనా?

Most IPL Matches: ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టీ20 లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ మెగా లీగ్ గ్‌లో అనేక మంది స్టార్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేసి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు కొందరు ప్లేయర్స్ టైటిల్స్ కూడా గెలుచుకున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్లు ఎన్నో మ్యాచ్‌లు ఆడినా.. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఈ జాబితాలో చాలా స్టార్ ప్లేయర్స్ పేర్లు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం:

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్. అతను ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ గెలవలేకపోయాడు. రెండో స్థానంలో భారత ఆటగాడు సంజు శాంసన్ ఉన్నాడు. శాంసన్ ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడినా టైటిల్‌ను అందుకోలేకపోయాడు. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (174 మ్యాచ్‌లు), మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా (162 మ్యాచ్‌లు), ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ (162 మ్యాచ్‌లు) కూడా ఈ జాబితాలో ఉన్నారు.

రాహుల్, గేల్, మాక్స్‌వెల్ కూడా:

ఇక ఈ జాబితాలో లోకేష్ రాహుల్ (145 మ్యాచ్‌లు), క్రిస్ గేల్ (142 మ్యాచ్‌లు), గ్లెన్ మాక్స్‌వెల్ (141 మ్యాచ్‌లు), సందీప్ శర్మ (137 మ్యాచ్‌లు), రిషబ్ పంత్ (125 మ్యాచ్‌లు) కూడా ఉన్నారు. వీరంతా ఐపీఎల్‌లో గొప్ప ప్రదర్శనలు చేసినప్పటికీ.. ఇప్పటివరకు టైటిల్ గెలవలేకపోయారు. అయితే ఇప్పుడు సంజు శాంసన్ బ్యాడ్ లక్ మారే అవకాశాలు ఉన్నాయి. అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నైలో చేరడంతో ఈ చెత్త రికార్డుకు త్వరలో పులిస్టాప్ పడనుందని అభిమానులు భావిస్తున్నారు. సీఎస్కే ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో శాంసన్‌కు టైటిల్ గెలిచే అవకాశం దక్కుతుందా? లేక ఈ జాబితాలోనే ఇంకా కొనసాగుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. క్రికెట్ అభిమానులు మాత్రం ఈసారి శాంసన్ అదృష్టం మారుతుందని ఆశిస్తున్నారు.

టైటిల్ రుచి చూడని స్టార్‌లు:

184 - AB డివిలియర్స్

177 - సంజు శాంసన్

174 - యుజ్వేంద్ర చాహల్

162 - అమిత్ మిశ్రా

162 - అక్షర్ పటేల్

145 - కెఎల్ రాహుల్

142 - క్రిస్ గేల్

141 - గ్లెన్ మాక్స్‌వెల్

137 - సందీప్ శర్మ

125 - రిషబ్ పంత్

Tags:    

Similar News