KKR Captaincy: మరోసారి అతడికే కేకేఆర్ సారథ్య బాధ్యతలా?.. ఆ 8 మంది విదేశీ స్టార్లలో ఎవరికి అవకాశం!

KKR Captaincy 2026: ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం కేకేఆర్ యాజమాన్యం మళ్లీ రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Update: 2026-03-15 14:41 GMT

KKR Captaincy: మరోసారి అతడికే కేకేఆర్ సారథ్య బాధ్యతలా?.. ఆ 8 మంది విదేశీ స్టార్లలో ఎవరికి అవకాశం!

KKR Captaincy 2026: ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకోవడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం కేకేఆర్ యాజమాన్యం మళ్లీ రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

రహానే మాకు బెస్ట్ ఛాయిస్:

'అజింక్య రహానే మంచి ఆటగాడు. అతడి అనుభవం కేకేఆర్ జట్టుకు ఎంతో అవసరం. కెప్టెన్‌గా రహానే మాకు బెస్ట్ ఛాయిస్. ఫ్రాంచైజీ ఇప్పటికే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంది' అని కేకేఆర్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రహానే కంటే మంచి సారథి జట్టులో లేడు. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేదు. దాంతో జింక్స్ సారథిగా కొనసాగనున్నాడు. గత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేసిన రహానే.. జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. ఈ సీజన్‌లోనూ అతడు వన్‌ డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. రహానే పవర్ ప్లేలో ధాటిగా ఆడాడు.

బలోపేతమైన బ్యాటింగ్ లైనప్:

ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ తన బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. కివీస్ హిట్టర్ ఫిన్ అలెన్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీతో సంచలనం సృష్టించాడు. టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్రలు టాప్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించగల సమర్థులు. కామెరూన్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు సమతుల్యతను తీసుకువస్తాడు.

తుది జట్టు ఎంపిక సవాలే:

జట్టులో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్రలతో పాటు జట్టులో మరికొందరు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. సునీల్ నరైన్, బ్లెస్సింగ్ ముజరబాని, రోవ్‌మన్ పావెల్, మతీశా పతిరన ఉన్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని ఆడిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హర్షిత్ రాణా దూరం:

కేకేఆర్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడైన హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జట్టుకు పెద్ద లోటే అని చెప్పాలి. అయితే దీనిపై ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ హర్షిత్ దూరమైతే, రిప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2026 కేకేఆర్ స్క్వాడ్:

కెప్టెన్: అజింక్య రహానే

ఓవర్సీస్ స్టార్స్: కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, బ్లెస్సింగ్ ముజారబానీ, మతీషా పతిరానా

ఇండియన్ ప్లేయర్స్: రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, ఆకాష్ దీప్, కార్తీక్ త్యాగి, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా

అన్‌క్యాప్డ్/యంగ్ టాలెంట్: తేజస్వి సింగ్, దక్ష్ కమ్రా, అంగ్క్రిష్ రఘువంశీ, సుయాష్ శర్మ, అల్లా ఘజన్‌ఫర్

Tags:    

Similar News