CSK vs SRH: ఆమ్మో! కావ్య పాప.. చెన్నై సూపర్ కింగ్స్ కి గట్టి దెబ్బే కొట్టిందిగా

CSK vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ నెట్వర్క్ కోర్టులో కేసు వేసింది. దీని వెనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఉన్నారని క్రికెట్ వర్గాల టాక్

Update: 2026-03-15 12:30 GMT

CSK vs SRH

CSK vs SRH: టైటిల్ చూసి ఏంటీ కావ్య సీఎస్కె నుంచి ఎవరినైనా లాగేసిందా అనుకుంటున్నారా? అబ్బే అలాజరిగితే దానికి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన పనిలేదు. ఇలాంటివి ఐపీఎల్ లో మామూలే. అంతకు మించి తెరచాటు రాజకీయంతో చెన్నై సూపర్ కింగ్స్ ని ముప్పుతిప్పలు పెట్టింది కావ్య. అదేంటో అర్ధం అవ్వాలంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి.

భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సన్ పిక్చర్స్, IPL జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై ఫిర్యాదు చేసింది. దీనికి కారణం రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా. ఎందుకంటే..

మార్చి 1, 2026న, చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించడానికి సోషల్ మీడియాలో ఒక ప్రమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఎంఎస్ ధోని ఎంట్రీ, జెర్సీ ఆవిష్కరణ సమయంలో సన్ పిక్చర్స్ చిత్రాలైన 'జైలర్', 'జైలర్ 2' 'కూలీ' నుండి హిట్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ వాడుకున్నారు. ఈ వీడియో సూపర్ హిట్ అయింది. క్రికెట్ అభిమానులను ముఖ్యంగా ధోనీ ఫాన్స్ ను షేక్ చేసేసింది. ఇది సన్ పిక్చర్స్‌కు కోపం తెప్పించింది.

సన్ పిక్చర్స్ కోర్టును ఆశ్రయించి, CSK పై మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. సన్ పిక్చర్స్ తరపున వాదించిన న్యాయవాది, ఈ చిత్రాల హక్కులన్నీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సన్ పిక్చర్స్ వద్ద ఉన్నాయని చెప్పారు. CSK ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా వాటిని ఉపయోగించుకుంది. ఈ వీడియోను జెర్సీలు, ఇతర వస్తువుల అమ్మకానికి ఉపయోగిస్తున్నారు. ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం కాపీరైట్ ఉల్లంఘన అని వాదించారు. అలాగే, CSK కోటిరూపాయల పరిహారం చెల్లించాలని.. ఈ పాటల వినియోగానికి వ్యతిరేకంగా శాశ్వత నిషేధం జారీ చేయాలని సన్ పిక్చర్స్ బృందం కోర్టును అభ్యర్థించింది.

CSK vs SRH:దీనికి ప్రతిగా చెన్నై జట్టు తరపున వాదించిన న్యాయవాదులు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి అభ్యంతరకరమైన వీడియోలను ఇప్పటికే తొలగించినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా సన్ నెట్‌వర్క్ అలాంటి పాటలను ఉపయోగించడాన్ని వ్యతిరేకించలేదని.. అందుకే వాటిని ఉపయోగించారని వివరించారు. ఇక ఈ అభ్యంతరాలతో వీడియోలను తొలగించినట్లు కోర్టుకు చెప్పారు. అంతేకాదు.. సన్ పిక్చర్స్ అనుమతి లేదా లైసెన్స్ లేకుండా భవిష్యత్తులో ఎలాంటి సంగీతాన్ని ఉపయోగించబోమని వారు కోర్టుకు హామీ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని CSK లిమిటెడ్‌ను ఆదేశించి, విచారణను మార్చి 16కి వాయిదా వేశారు.

అంతేకదా.. అయిపోయింది కదా.. దీనికి కావ్యకి సంబంధం ఏమిటి? అంటారా.. అక్కడికే వస్తున్నా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ అయిన కావ్య మారన్ సన్ పిక్చర్స్ యజమాని కుమార్తె. హైదరాబాద్ జట్టు సన్ నెట్‌వర్క్ వ్యాపారంలో భాగం. సో SRH CSK మధ్య పోరాటంలో భాగంగా ఈ చర్యకు సన్ నెట్ వర్క్ దిగిందనేది ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరి టైటిల్ జస్టిఫికేషన్ అయినట్టే కదా!

Tags:    

Similar News