Mumbai Indians Captaincy: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు.. హార్దిక్ పాండ్య స్థానంలో ఎవరంటే?
Mumbai Indians Captaincy: ముంబై మేనేజ్‌మెంట్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జట్టు ప్రస్తుత కెప్టెన్ పాండ్యను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నియమించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Mumbai Indians Captaincy: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు.. హార్దిక్ పాండ్య స్థానంలో ఎవరంటే?
Mumbai Indians Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకటి. ఐపీఎల్‌లో ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై అన్ని టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. అయితే జట్టు భవిష్యత్ దృష్ట్యా 2024 సీజన్ ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యకు పగ్గాలు అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో జట్టు చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేదు. ఈ నేపథ్యంలో ముంబై మేనేజ్‌మెంట్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జట్టు ప్రస్తుత కెప్టెన్ పాండ్యను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను నియమించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును విజయపథంలో నడిపించాడు. టీమిండియాకు టైటిల్ అందించడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం సూర్యపై మరింత నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. కీలక మ్యాచ్‌లలో సమర్థ నాయకత్వం ప్రదర్శించిన సూర్యకుమార్ నాయకత్వ సామర్థ్యంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. మరోవైపు గత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్య ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. జట్టు ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉండటంతో పాటు ఆయన ఫిట్‌నెస్, క్రమశిక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జట్టులో మార్పులు అవసరమని ముంబై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.
హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్, ఫామ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమిస్తే.. జట్టుకు కొత్త ఊపు వస్తుందని యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంతో ముంబై మేనేజ్‌మెంట్ దృష్టి అంతా సూర్య వైపు వెళ్లిందట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ముంబై జట్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం. ముంబైలోని వాంఖడే స్టేడియం హోం గ్రౌండ్. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలు కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు.