Smriti Mandhana: పెళ్లి వాయిదా.. ఆ పోస్టులు డిలీట్‌ చేసిన స్మృతి మంధాన..!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరియు మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటం తెలిసిందే.

Update: 2025-11-24 11:40 GMT

Smriti Mandhana: పెళ్లి వాయిదా.. ఆ పోస్టులు డిలీట్‌ చేసిన స్మృతి మంధాన..!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరియు మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటం తెలిసిందే. నవంబర్ 23న బెంగళూరులో జరగాల్సిన పెళ్లి వేడుకల సమయంలో స్మృతి తండ్రి అనారోగ్యం పాలవడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లి వాయిదా పడిన నేపథ్యంలో, స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇటీవల షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వీడియోలు కన్పించకపోవడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల, స్మృతి మంధాన తన సహచర క్రికెటర్లతో కలిసి 'సమ్‌జో హో హై గయా' పాటకి డ్యాన్స్ చేస్తూ, తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించింది. ఈ వీడియో ఇప్పుడు ఆమె ఖాతాలో లేదు. అంతేకాకుండా, ఆమె స్నేహితురాళ్లు, సహచర క్రికెటర్లు అయిన జెమీమా మరియు శ్రేయాంక కూడా తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఇదే వీడియోను తొలగించడం గమనార్హం.

ఈ వీడియోను స్మృతి డిలీట్ చేశారా లేక కేవలం దాచిపెట్టారా (Hide) అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, పలాశ్ ముచ్చల్ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం, నవీ ముంబయి స్టేడియంలో స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పటికీ అందుబాటులోనే ఉంది.

వాయిదాకు కారణాలు

పెళ్లి వేడుకల్లోనే స్మృతి తండ్రికి అనారోగ్యం రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక స్మృతి స్వయంగా వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం పలాశ్ ముచ్చల్ కూడా ఇన్ఫెక్షన్, ఎసిడిటీ కారణంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

స్మృతి మరియు పలాశ్ 2019 నుంచి రిలేషన్‌లో ఉండగా, గతేడాది వారి ప్రేమ బంధం గురించి బహిరంగంగా ప్రకటించారు. పెళ్లి వాయిదా మరియు ఇన్‌స్టా పోస్ట్‌ల మాయంతో, ఈ జంట కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News