Smriti-Palash: ఆస్పత్రిలో చేరిన స్మృతి మంధానాకు కాబోయే భర్త పలాశ్
Smriti-Palash: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరియు సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం మరోసారి వాయిదా పడింది.
Smriti-Palash: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరియు సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం మరోసారి వాయిదా పడింది. ఆదివారం జరగాల్సిన వీరి వివాహం, స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజాగా, సోమవారం ఉదయం వరుడు పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు వెల్లడించారు. వరుస అనారోగ్య కారణాల వల్ల ఈ సెలబ్రిటీ వివాహం వరుసగా రెండు రోజులు వాయిదా పడటం చర్చనీయాంశమైంది.