Adilabad: ఇంటి పెరట్లో ఒకేసారి విరబూసిన 21 బ్రహ్మకమలాలు.. ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
Adilabad: శ్రావణమాసం చివరివారం కావడంతో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
Adilabad: ఇంటి పెరట్లో ఒకేసారి విరబూసిన 21 బ్రహ్మకమలాలు.. ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
Adilabad: ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాలలో పెరిగే బ్రహ్మకమలాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో కూడా వికసిస్తూ సందడి చేస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రాత్రి సమయంలో వికసించే బ్రహ్మకమలం చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎక్కడో ఉత్తరాఖండ్లో పెరిగే ఈ పుష్పాలు తాజాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో కూడా సందడి చేశాయి. తోషం గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇంటి పెరట్లో రాత్రి ఒకేసారి 21 బ్రహ్మకమలాలు వికసించాయి. బ్రహ్మకమలాలు వికసించడంతో వాటిని చూడటానికి చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. శ్రావణమాసం చివరి వారం కావడంతో బ్రహ్మకమలం పుష్పానికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మకమలాలు ఏడాది కాలంలో ఒకే సారి మాత్రమే వికసిస్తాయి. అదే విధంగా బ్రహ్మ కమలాలు పగలు కాకుండా రాత్రి మాత్రమే వికసించి మరుసటి రోజుకి మొగ్గలా ముడుచుకుపోవడం ఈ పుష్పాల ప్రత్యేకత.