గబ్బర్ సింగ్ నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి : బండ్ల గణేష్
తెలుగు చలన చిత్రంలో గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
తెలుగు చలన చిత్రంలో గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2012లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, పవన్ మేనరిజం, కబడ్డీ , అంతాక్షరి ఇలా ప్రతి ఒక్కటి ఫ్యాన్స్ ని అలరించాయి.
ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని ప్రేక్షకులు కాలర్ ఎగరేసే సినిమాగా నిలిచింది. ఓ డైరెక్టర్ గా కాకుండా ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలా సినిమాను తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించాడు హరీష్.. ఇక శృతి హాసన్ అందాలు, దేవి అదిరిపోయే పాటలు, బండ్ల గణేష్ భారీ నిర్మాణ విలువలు సినిమాకి పెద్ద అసెట్ గా నిలిచాయి.
నేటితో ఈ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం సినిమా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమాకు సంబంధించిన తీపిగుర్తులను నెమరువేసుకుంటున్నారు. అందులో భాగంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాననీ, గబ్బర్ సింగ్ ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి అంటూ గణేష్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ రోజుల్లో నిన్న అని రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు. కానీ నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాననీ అన్నారు.
చరిత్రలో కొన్ని చిరస్థాయిగా ఉండిపోతాయి తెలుగు చలనచిత్ర చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ చరిత్ర అంటూ..తింటే గారెలు తినాలి వింటే రామాయణం వినాలి తీస్తే గబ్బర్ సింగ్ తీయాలి ఇది నా అదృష్టం జై పవర్ స్టార్ అంటూ వరుస ట్వీట్లు చేశారు బండ్లగణేష్.