సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ పోటీ తప్పదా..?

సంక్రాంతి సందర్బంగా సూపర్ స్టార్ రజిని కాంత్ "దర్బార్" చిత్రంతో మన ముందు వస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2019-12-17 05:40 GMT
రజిని కాంత్, ధనుష్

సంక్రాంతి సందర్బంగా సూపర్ స్టార్ రజిని కాంత్ "దర్బార్" చిత్రంతో మన ముందు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో  ఈ సినిమా తెరకెక్కుతుంది. చిత్రికరణ మొదలైనప్పుడే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు వెల్లడించారు. అయితే హీరో ధనుష్ నటించిన "పటాస్" చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టు నిర్మాతలు గత నెలలో ప్రకటించారు. సంక్రాంతికి మామ అల్లుళ్ళు పోటీపడతారని అంత భావించారు, కానీ ఈ చిత్రాన్ని "దర్బార్" రిలీజ్ అయిన రెండు వరాల తర్వాత రిలీజ్ చేయాలిని అనుకున్నారు.

అయితే ఈ చిత్రాన్ని జనవరి 16 న రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు తెలిసింది. అందువల్లే "పటాస్" వారంరోజుల తరువాత వస్తుంది అని తెలియజేసారు. ఇలాగే గత ఏడాది రజినీకాంత్ నటించిన "పేట" మరియు అజిత్ నటించిన "విశ్వాసం" బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. "పటాస్"లో మెహెరినే హీరోయిన్ గా నటిస్తుంది, అంతే కాకుండా స్నేహ ముఖ్యపాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ట్రైలర్ మరియు పాటలను విడుదల చేయనున్నట్టు దర్శక, నిర్మాతలు వెల్లడించారు.

రజనీకాంత్ దర్బార్ సినినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దాదాపు పాతికేళ్ళ తరువాత పోలీసు డ్రస్సు వేశారు రజనీకాంత్. ఇక ఆ డ్రస్సులో అయన చేసిన విన్యాసాలకు ఇప్పుడు సోషల్ మీడియా ఊగిపోతోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కాగా, ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సంక్రాంతి బరిలో ఎవరి సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో సంక్రాంతి వరకు వేచి చూద్దాం.



Tags:    

Similar News