Allu Arjun: రూ. 800 కోట్ల బడ్జెట్.. హాలీవుడ్ రేంజ్ మేకింగ్! కానీ అట్లీపై అల్లు అర్జున్ అసంతృప్తి?

Allu Arjun: పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో కలిసి ఒక భారీ విజువల్ వండర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

Update: 2026-02-14 06:49 GMT

Allu Arjun: పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో కలిసి ఒక భారీ విజువల్ వండర్‌ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

షూటింగ్ జాప్యంపై బన్నీ ఆందోళన?

ఈ సినిమా హై-ఎండ్ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని సమాచారం. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ విషయంలో అల్లు అర్జున్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగుతుండటమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ప్లాన్ చేసిన రిలీజ్ డేట్ మిస్ కాకూడదని, మేకింగ్ ప్లాన్‌ను మరింత పక్కాగా రూపొందించి షూటింగ్ వేగవంతం చేయాలని అల్లు అర్జున్ మేకర్స్‌కు సూచించినట్లు టాక్ వినిపిస్తోంది.

లోకేష్ కనగరాజ్‌తో తదుపరి పోరు!

అట్లీ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ రెండు భారీ చిత్రాలు పూర్తయ్యే సరికి బన్నీ రేంజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అట్లీ - బన్నీ కాంబో మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News