Weight Loss: వ్యాయామం ఒక్కటే చేస్తే బరువు తగ్గరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Weight Loss: బరువు తగ్గాలనుకునే చాలామంది కేవలం వ్యాయామం మీద మాత్రమే ఆధారపడతారు. కానీ, ఇది ఒక అసంపూర్ణమైన ఆలోచన అని నిపుణులు అంటున్నారు.

Update: 2025-08-09 08:30 GMT

Weight Loss: వ్యాయామం ఒక్కటే చేస్తే బరువు తగ్గరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Weight Loss: బరువు తగ్గాలనుకునే చాలామంది కేవలం వ్యాయామం మీద మాత్రమే ఆధారపడతారు. కానీ, ఇది ఒక అసంపూర్ణమైన ఆలోచన అని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. అయితే, మీరు మీ ఆహారం పై దృష్టి పెట్టకపోతే బరువు తగ్గడం చాలా కష్టం. కేవలం వ్యాయామం చేస్తే బరువు తగ్గడంలో లిమిటెడ్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయని అనేక పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు సరైన ఆహారం కూడా అంతే ముఖ్యం. మరి కేవలం వ్యాయామంతోనే బరువు ఎందుకు తగ్గదో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం బరువు తగ్గాలనే ఆలోచన చేయగానే మన మనసులో ముందుగా వచ్చేది వ్యాయామం చేయాలనే ఆలోచనే. అయితే, కేవలం వ్యాయామంతోనే బరువు తగ్గడం సాధ్యం కాదు. దీనికి ముఖ్య కారణం మనం తీసుకునే క్యాలరీల కన్నా ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయకపోవడమే. ఉదాహరణకు, మీరు ఒక గంట పాటు జాగింగ్ చేస్తే సుమారు 400-500 క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, ఆ తర్వాత మీరు ఒక్క హై-క్యాలరీ స్నాక్ లేదా ఫాస్ట్ ఫుడ్ తింటే మీరు చేసిన కష్టం మొత్తం వృథా అవుతుంది. కాబట్టి, బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు జీవనశైలిలో సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.

బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం రెండూ సమతుల్యంగా ఉండాలి. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి, శరీర జీవక్రియ (మెటబాలిజం) మెరుగుపడుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. కానీ, శరీరంలోకి వెళ్లే క్యాలరీల మొత్తాన్ని కంట్రోల్ చేసేది మాత్రం మన ఆహారపు అలవాట్లే. మీరు తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్, ప్రోటీన్‌లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే శరీరం సరైన పోషణ పొందుతుంది. కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అందుకే, కేవలం వ్యాయామం చేశాం కదా అని నచ్చింది తినేయొచ్చనే ఆలోచన తప్పు.

బరువు తగ్గడానికి రోజువారీ క్యాలరీ డెఫిసిట్ చాలా అవసరం. అంటే, మీరు రోజూ ఖర్చు చేసే క్యాలరీల కన్నా తక్కువ క్యాలరీలను ఆహారం ద్వారా తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గే క్రమంలో 70 శాతం ఆహారం, 30 శాతం వ్యాయామం పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గడానికి కేవలం వ్యాయామమే కాదు, మీ జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. చక్కెర, అధిక నూనె వాడిన పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. వ్యాయామం తర్వాత ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న స్నాక్స్ తినాలి. రోజూ సరిపడా నిద్రపోవడం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఎక్కువ నీరు తాగాలి.

Tags:    

Similar News