Fatty Liver: రోజూ ఈ 5 అలవాట్లను జీవితంలో భాగం చేసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్య రానేరాదు

Fatty Liver: ఇప్పటి జీవనశైలిలో మార్పులు, తప్పు ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువవుతోంది. లివర్‌లో అవసరానికి మించి కొవ్వు చేరితే దీనిని ఫ్యాటీ లివర్ అంటారు. దీన్ని ప్రారంభ దశలోనే నియంత్రిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు. రోజువారీ జీవితంలో కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Update: 2026-03-18 10:35 GMT

రోజూ వ్యాయామం చేయాలి

ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలంటే శారీరక వ్యాయామం చాలా ముఖ్యం. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు లివర్‌లో ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఫ్యాట్ తగ్గడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, లివర్ పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది.

ఆకుకూరలు ఎక్కువగా తినాలి

పాలకూర, మెంతికూర, బ్రోక్లీ వంటి ఆకుకూరలు లివర్‌కు చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అలాగే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజూ ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవడం మంచిది.

గ్రీన్ టీ, నిమ్మరసం, పసుపు నీరు

గ్రీన్ టీ తాగడం కూడా లివర్‌కు చాలా మంచిది. ఇందులో ఉన్న క్యాటెకిన్స్ లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ తాగితే లాభం ఉంటుంది. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా పసుపు నీరు తాగితే లివర్ కణాలు రక్షణ పొందుతాయి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.

చక్కెర, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి

కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి లివర్‌లో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తగ్గించడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటే లివర్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

బరువు నియంత్రణ చాలా ముఖ్యం

అధిక బరువు కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం. కాబట్టి బరువును నెమ్మదిగా తగ్గించడం, కంట్రోల్‌లో ఉంచడం అవసరం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల మెటాబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. దీని వల్ల లివర్‌లో ఉన్న కొవ్వు తగ్గి, పనితీరు మెరుగుపడుతుంది.

Tags:    

Similar News