Heart Health: మీకు జీవితంలో గుండెపోటు రావొద్దంటే.. రాత్రి 8 త‌ర్వాత ఈ ప‌నులు మానేయండి

Heart Health: ఇటీవ‌ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవ‌న విధానమే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 8 త‌ర్వాత కొన్ని ప‌నులు పూర్తిగా మానేయాల‌ని సూచిస్తున్నారు.

Update: 2026-03-18 09:02 GMT

Heart Health: మీకు జీవితంలో గుండెపోటు రావొద్దంటే.. రాత్రి 8 త‌ర్వాత ఈ ప‌నులు మానేయండి

Heart Health: ఇటీవ‌ల గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవ‌న విధానమే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 8 త‌ర్వాత కొన్ని ప‌నులు పూర్తిగా మానేయాల‌ని సూచిస్తున్నారు.

రోజంతా పని ముగిసిన తర్వాత మనకు రిలాక్స్ అయ్యే టైమ్‌గా సాయంత్రం. కానీ అదే సమయంలో మన శరీరం, ముఖ్యంగా గుండె (Heart), తన రికవరీ పనిని ప్రారంభిస్తుంది. రక్తపోటు తగ్గుతుంది, హార్ట్ రేట్ నెమ్మదిస్తుంది,

శరీరం రిపేర్ మోడ్‌లోకి వెళుతుంది. కానీ ఈ సమయంలో కొన్ని అలవాట్లు ఈ సహజ ప్రక్రియను అడ్డుకుంటాయి. అవేంటంటే..

పెద్ద మొత్తంలో డిన్న‌ర్, గుండెపై ఒత్తిడికి కార‌ణం:

రాత్రి ఎక్కువగా తినడం చాలా మందికి అలవాటు. అయితే ఇది గుండె ఆరోగ్యానికి అస్స‌లు మంచిది కాదు. ఇలా చేస్తే శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో జీర్ణక్రియ (digestion) మొదలవుతుంది. దీంతో రక్తం జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా వెళుతుంది. గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అందుకే ప‌డుకునే ముందు క‌నీసం 2 నుంచి 3 గంట‌ల ముందే లైట్ ఫుడ్ తీసుకోవ‌డం మంచిది.

సాయంత్రం కాఫీ — నిద్రను దూరం చేస్తుంది

సాయంత్రం కాఫీ తాగే అల‌వాటు చాలామందికి ఉంటుంది. కాఫీ లోని కేఫిన్ 6 గంటల వరకు శరీరంలో ఉంటుంది. దీంతో హార్ట్ రేట్ పెరుగుతుంది, నిద్ర ఆలస్యమవుతుంది. ఫ‌లితంగా మరుసటి రోజు రక్తపోటు పెరుగుతుంది.

ఆల్క‌హాల్‌తో నిద్ర దూరం

చాలామంది రాత్రి మద్యం తీసుకుంటే బాగా నిద్ర పడుతుందని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు.

మొదట నిద్రలా అనిపించినా తర్వాత నిద్ర‌ను డిస్ట్ర‌బ్ చేస్తుంది. హార్ట్ రిథమ్ లో మార్పులు వస్తాయి. ఇది గుండెపోటు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

స్క్రీన్ టైమ్ — గుండె రిథమ్‌ను దెబ్బతీస్తుంది

రాత్రి బెడ్‌పై ఫోన్‌, ల్యాప్‌టాప్ ఉప‌యోగించే వారి సంఖ్య పెరిగింది. అయితే రాత్రుళ్లు లైట్ ఆఫ్ చేసిన త‌ర్వాత ఈ గ్యాడ్జెట్స్ నుంచి వ‌చ్చే బ్లూ లైట్ వల్ల మెదడు ఇంకా పగలే అనుకుంటుంది. దీంతో మెలటోనిన్ (sleep hormone) తగ్గుతుంది. దీనివ‌ల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది.

వ్యాయామం చేయ‌డం, స్మోకింగ్

రాత్రుళ్లు ఎక్కువ‌గా ఒత్తిడితో ఉండ‌డం, ఎక్కువ‌గా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం, స్మోకింగ్ వంటివి గుండెకు హానికరం. వీటివ‌ల్ల కార్టిసోల్ (stress hormone) పెరుగుతుంది. ఇది ర‌క్త‌పోటు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

ఆల‌స్యంగా నిద్ర పోవ‌డం

అమెరికా హార్ట్ అసోసియేష‌న్ ప్రకారం.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రి స‌రైన నిద్ర‌లేక‌పోతే గుండె రికవరీ టైమ్ తగ్గుతుంది. ఇది స్ట్రోక్, హార్ట్ అటాక్ ప్రమాదం పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్

రాత్రి చిప్స్, నమకీన్ వంటి స్నాక్స్ తినడం చాలా కామన్. అయితే వీటిలో అధికంగా ఉండే సోడియం ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది. శ‌రీరంలో నీటి శాతం త‌గ్గుతుంది. డీహైడ్రేష‌న్ కార‌ణంగా ర‌క్త ప‌రిమాణం పెరుగుతుంది. ఇది ర‌క్త‌పోటుకు దారి తీస్తుంది.

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.?

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జీవ‌న‌శైలి మార్పులు చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తేలికపాటి డిన్నర్ చేయ‌డం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, కాఫీ, ఆల్కహాల్ నివారించడం, త్వరగా నిద్రపోవడం, ఒత్తిడి త‌గ్గించుకోవ‌డానికి యోగా, మోడిటేష‌న్ వంటివి అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Tags:    

Similar News