Cancer: జుట్టు ఊడుతోందని ఇలా చేస్తున్నారా.? క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
Cancer: మారిన జీవన విధానం, పొల్యుషన్ కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం సర్వసాధారణంగా మారింది. మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలా మంది మహిళలు బ్యూటీ కోసం హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన ఒక పరిశోధన దీనిపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎక్స్టెన్షన్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
Cancer: జుట్టు ఊడుతోందని ఇలా చేస్తున్నారా.? క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
Cancer: మారిన జీవన విధానం, పొల్యుషన్ కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం సర్వసాధారణంగా మారింది. మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలా మంది మహిళలు బ్యూటీ కోసం హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన ఒక పరిశోధన దీనిపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎక్స్టెన్షన్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
హెయిర్ ఎక్స్టెన్షన్స్‌లో ప్రమాదకర కెమికల్స్
శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయనంలో మొత్తం 43 రకాల హెయిర్ ఎక్స్టెన్షన్స్‌ను పరిశీలించారు. అందులో దాదాపు 170 రకాల కెమికల్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిలో వీటిలో ముఖ్యంగా ఫ్తాలేట్స్ (Phthalates), ఆర్గనోటిన్స్ (Organotins)తో పాటు ఇతర ఇండస్ట్రియల్ కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కెమికల్స్ శరీరానికి హానికరమైనవిగా గుర్తించారు.
హార్మోన్ వ్యవస్థపై ప్రభావం
ఈ కెమికల్స్‌లో కొన్ని “ఎండోక్రైన్ డిస్రప్టర్స్”గా పని చేస్తాయి. అంటే శరీరంలోని హార్మోన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. శరీర అభివృద్ధి ప్రక్రియను మార్చే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం
కొన్ని సాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్ కూడా కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే
హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడితే వెంటనే రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనే స్పష్టమైన ఆధారం లేదని కానీ ఈ కెమికల్స్ శరీరంలో మార్పులు తెచ్చి, కాలక్రమంలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
నేచురల్ హెయిర్ కూడా పూర్తిగా సేఫ్ కాదు
చాలామంది “నేచురల్” లేదా “హ్యూమన్ హెయిర్” ఎక్స్టెన్షన్స్ సేఫ్ అనుకుంటారు. కానీ అధ్యయనంలో తేలిన విషయాల ప్రకారం 100% నేచురల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్‌లో కూడా కెమికల్స్ కనిపించాయి. ప్రాసెసింగ్ సమయంలో ఉపయోగించే పదార్థాల వల్ల ఇవి కలిసే అవకాశం ఉంది. అందుకే “నేచురల్” అనే లేబుల్ ఉన్నా పూర్తిగా సురక్షితం అని చెప్పలేం.
ఇతర ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హెయిర్ ఎక్స్టెన్షన్స్ వల్ల వచ్చే ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటిలో ప్రధానం నెత్తిపై భాగంలో (స్కాల్ప్ మీద) ఇరిటేసన్ , చర్మ అలర్జీలు, శ్వాస సమస్యలు (హీట్ లేదా స్టైలింగ్ సమయంలో గ్యాస్ వల్ల) వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమస్యల నుంచి కొంతమేర అయినా ఉపశమనం పొందాలంటే.. మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. ఎక్కువ కాలం అదే పనిగా వాడకుండా మధ్యమధ్యలో బ్రేక్ ఇవ్వాలి. స్కిన్ రియాక్షన్ ఉంటే వెంటనే తీసేయాలి. నమ్మకమైన బ్రాండ్స్ మాత్రమే ఎంచుకోవాలి.
గమనిక: హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడటం వల్ల నేరుగా బ్రెస్ట్ వస్తుందని నిర్ధారణ కాలేదు. కానీ వాటిలో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.