Papaya: ఎండకాలంలో బొప్పాయి తింటే వేడి అవుతుందా.? ఇందులో నిజమెంత
Papaya: సహజంగా బొప్పాయి అంటే శరీరానికి వేడి చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే గర్భిణీలు ఇవి తినకూడదని అంటుంటారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది. సమ్మర్‌లో బొప్పాయి తింటే ఏమైనా సమస్యలు వస్తాయా.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Papaya: ఎండకాలంలో బొప్పాయి తింటే వేడి అవుతుందా.? ఇందులో నిజమెంత
Papaya: సహజంగా బొప్పాయి అంటే శరీరానికి వేడి చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే గర్భిణీలు ఇవి తినకూడదని అంటుంటారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది. సమ్మర్‌లో బొప్పాయి తింటే ఏమైనా సమస్యలు వస్తాయా.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయిలో బోలేడు పోషక విలువలు
బొప్పాయి పండులో శరీరానికి అవసరమైన అనేక ముఖ్య పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ A, విటమిన్ C, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ తక్కువ పరిమాణంలో బొప్పాయి తీసుకుంటే శరీరం సక్రమంగా పనిచేస్తుంది.
వేసవిలో బొప్పాయి మంచిది కాదా.?
బొప్పాయి వేడి చేస్తుందనేది పూర్తిగా తప్పు. నిజానికి సమ్మర్‌లో బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో శరీరం త్వరగా అలసిపోతుంది. అప్పుడు బొప్పాయి తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇందులో ఉన్న నీటి శాతం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే అలసట, డీహైడ్రేషన్ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
బొప్పాయి తినడానికి సరైన సమయం
బొప్పాయి తినడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపు లేదా అల్పాహారం సమయంలో. ఈ సమయంలో తింటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. రోజంతా కడుపు తేలికగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. రాత్రి కూడా తినవచ్చు కానీ భోజనం చేసిన వెంటనే తినకూడదు. కనీసం 3–4 గంటల గ్యాప్ ఉండాలి.
జీర్ణక్రియకు బొప్పాయి ఎలా సహాయపడుతుంది?
బొప్పాయిలో “పపైన్” అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పేగులను శుభ్రంగా ఉంచి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెంచడంలో పాత్ర
బొప్పాయి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉన్న విటమిన్ C శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. జలుబు, వైరల్ సమస్యలు తక్కువగా రావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం పెట్టడంలో ఇది ఉపయోగకరం.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో సమాచారం ఆధారంగా అందించడమైంది. ఆరోగ్యానికి సంబంధించ వైద్యుల సూచనలే ప్రాణామికంగా తీసుకోవాలి.