Coconut Water vs Lemon Water: కొబ్బరి నీళ్లు vs నిమ్మరసం.. ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?
Coconut Water vs Lemon Water: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసంలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి. ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లు, విటమిన్-సి నిచ్చే నిమ్మరసం శరీరానికి చేసే మేలు ఏమిటి? నిపుణుల సూచనల ప్రకారం వీటిని ఎప్పుడు, ఎలా తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీలో చదవండి.
Coconut Water vs Lemon Water: కొబ్బరి నీళ్లు vs నిమ్మరసం.. ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?
Coconut Water vs Lemon Water: భానుడి భగభగలకు శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి సమయంలో కేవలం నీరు మాత్రమే కాకుండా, శరీరానికి శక్తినిచ్చే పానీయాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ సమయంలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి సహజ సిద్ధమైన పానీయాల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. అయితే, వీటిలో ఏది శరీరానికి ఎక్కువ ప్రయోజనకరం అనే అంశంపై నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు..
వేసవిలో కొబ్బరి నీళ్లను ఒక 'సూపర్ డ్రింక్'గా పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవి శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడమే కాకుండా, ఎండ వల్ల వచ్చే నీరసం, వడదెబ్బ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు. ఇందులో తక్కువ కేలరీలు, సహజ చక్కెరలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపికగా పరిగణించవచ్చని అన్నారు.
నిమ్మరసం పవర్..
భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన, చౌకైన పానీయంగా నిమ్మరసంకు ప్రత్యేమైన గుర్తింపు ఉంది. ఇందులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఎండ వేడిమి నుంచి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుందని, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
ఏది ఎప్పుడు తాగాలంటే..
నిపుణుల ప్రకారం.. ఈ రెండూ డ్రింగ్స్‌ను తమదైన రీతిలో శరీరానికి మేలు చేస్తాయి. శరీరంలోని లవణాలు కోల్పోయినప్పుడు కొబ్బరి నీళ్లు అత్యుత్తమ ఎలక్ట్రోలైట్ మద్దతును అందిస్తాయన్నారు. నిత్యం తాజాగా ఉండటానికి, శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చని అన్నారు. మధ్యాహ్న సమయంలో కొబ్బరి నీళ్లు, పుదీనా-నిమ్మరసం లేదా సబ్జా గింజల పానీయాలను మార్చి మార్చి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా ఖనిజాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని సూచించారు. మొత్తానికి, కొబ్బరి నీళ్లు వేగంగా శక్తిని ఇస్తే, నిమ్మరసం రిఫ్రెష్‌మెంట్‌తో పాటు రోగనిరోధక శక్తిని ఇస్తుందని వెల్లడించారు. ఈ రెండింటినీ మీ డైట్‌లో భాగం చేసుకోవడం ఉత్తమం అని సూచించారు.