ఉంఫాన్ పెను తుపాను లైవ్ అప్ డేట్స్ : ఒరిస్సాలో ముమ్మరంగా తుపాను సహాయక చర్యలు

ఉంఫాన్ పెను తుపాను సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఒరిస్సా తీర ప్రాంతంలో పెను ప్రతాపాన్ని చూపుతోంది. బెంగాల్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని భావిస్తున్న ఉంఫాన్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు..

Update: 2020-05-20 02:43 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుఫాన్ ఉంఫాన్. ప్రస్తుతం పారదీప్ కు 180,వైస్ట్ బెంగాల్ దీఘ 320,బంగ్లాదేశ్ ఖేపూరాకు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతంగంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ రోజు మధ్యహ్నం లేదా సాయంత్రం దీఘకు బంగ్లాదేశ్ లోని హతీయా ఐల్యాండ్స్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖా అధికారులు చెబుతున్నారు. పెనుతుఫాన్ ప్రభావం తో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 2 నుండి 3 మీటర్ల మేర ఎగసి పడుతున్న అలలు ఎగసి పడుతున్నాయి.

 



Live Updates
2020-05-20 15:12 GMT

ఉంఫాన్ పెను తుపాను సాయంత్రం 7 గంటల సమయంలో తీరం దాటింది.

మధ్యాహ్ట్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగింది.

 బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌ సమీపంలో ఈ పెను తుపాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. 



2020-05-20 10:23 GMT

ఉంఫాన్ పెను తుపాను వేగంగా తీరంవైపు కదులుతోంది. ఇప్పుడు ఈ భీకర తుపాను కదలికలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు..


Full View


2020-05-20 03:05 GMT
ఉంఫాన్ తుపాను ముప్పు నేపధ్యంలో వలస కార్మికులను తీసుకుని వెళ్ళాల్సిన రైళ్ళను రద్దు చేశారు.
2020-05-20 03:04 GMT

ఉంఫాన్ తుపాను ముప్పు ఎదుర్కుంటున్న ఓడిశా తీర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 1,04,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రజలకు అండగా ఓడిశా అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇంకా పలువురిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 





2020-05-20 03:01 GMT

పశ్చిమ బెంగాల్ - ఓడిస్సా ఉత్తర ప్రాంతాలకు  తుపాను హెచ్చరిక : పెను తుపాను ఉంఫాన్ పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీర ప్రాంతాల మధ్యలో ఉన్న హతియా ఐలాండ్ (బంగ్లాదేశ్) వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సాయంత్రం తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు.



2020-05-20 02:57 GMT

ఉంఫాన్ తుపాను ముప్పు ఉందని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ లో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను ఇలా మోసుకుని తరలిస్తున్నారు.




 


2020-05-20 02:54 GMT

ఉంఫాన్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈశాన్య భారతావని, బెంగాల్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆక్యూవెదర్  చెబుతున్న దాని ప్రకారం ఈ సాయంత్రానికి ఈ తుపాను ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

Tags:    

Similar News