ఉంఫాన్ పెను తుపాను లైవ్ అప్ డేట్స్ : ఒరిస్సాలో ముమ్మరంగా తుపాను సహాయక చర్యలు
ఉంఫాన్ పెను తుపాను సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. ఒరిస్సా తీర ప్రాంతంలో పెను ప్రతాపాన్ని చూపుతోంది. బెంగాల్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని భావిస్తున్న ఉంఫాన్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుఫాన్ ఉంఫాన్. ప్రస్తుతం పారదీప్ కు 180,వైస్ట్ బెంగాల్ దీఘ 320,బంగ్లాదేశ్ ఖేపూరాకు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతంగంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఈ రోజు మధ్యహ్నం లేదా సాయంత్రం దీఘకు బంగ్లాదేశ్ లోని హతీయా ఐల్యాండ్స్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖా అధికారులు చెబుతున్నారు. పెనుతుఫాన్ ప్రభావం తో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 2 నుండి 3 మీటర్ల మేర ఎగసి పడుతున్న అలలు ఎగసి పడుతున్నాయి.
Live Updates
- 20 May 2020 8:42 PM IST
తీరం దాటిన ఉంఫాన్
ఉంఫాన్ పెను తుపాను సాయంత్రం 7 గంటల సమయంలో తీరం దాటింది.
మధ్యాహ్ట్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగింది.
బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ సమీపంలో ఈ పెను తుపాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
- 20 May 2020 3:53 PM IST
ఉంఫాన్ తీరం వైపు కడులుతోందిలా..
ఉంఫాన్ పెను తుపాను వేగంగా తీరంవైపు కదులుతోంది. ఇప్పుడు ఈ భీకర తుపాను కదలికలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు..
- 20 May 2020 8:35 AM IST
ఉంఫాన్ తుపాను ముప్పు నేపధ్యంలో వలస కార్మికులను తీసుకుని వెళ్ళాల్సిన రైళ్ళను రద్దు చేశారు.
- 20 May 2020 8:34 AM IST
ఉంఫాన్ తుపాను ముప్పు ఎదుర్కుంటున్న ఓడిశా తీర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 1,04,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రజలకు అండగా ఓడిశా అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇంకా పలువురిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
- 20 May 2020 8:31 AM IST
పశ్చిమ బెంగాల్ - ఓడిస్సా ఉత్తర ప్రాంతాలకు తుపాను హెచ్చరిక : పెను తుపాను ఉంఫాన్ పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీర ప్రాంతాల మధ్యలో ఉన్న హతియా ఐలాండ్ (బంగ్లాదేశ్) వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సాయంత్రం తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు.
- 20 May 2020 8:27 AM IST
ఉంఫాన్ తుపాను ముప్పు ఉందని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ లో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను ఇలా మోసుకుని తరలిస్తున్నారు.

- 20 May 2020 8:24 AM IST
ఉంఫాన్ ఉగ్రరూపం
ఉంఫాన్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈశాన్య భారతావని, బెంగాల్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ చెబుతున్న దాని ప్రకారం ఈ సాయంత్రానికి ఈ తుపాను ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.
Powerful Cyclone #Amphan will pose an extreme risk to lives and property across northeast India and Bangladesh when it makes landfall Wednesday evening local time. https://t.co/73M7LbDau5 pic.twitter.com/33aDt61cca
— AccuWeather (@breakingweather) May 19, 2020




