Nellore: మేము ఇచ్చిన మాట నెరవేరుస్తాం గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్!

Nellore: గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మంగళూరు గ్రామంలో పర్యటించి పెన్షన్ల పంపిణీ మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

Update: 2026-04-02 08:14 GMT

Nellore: మేము ఇచ్చిన మాట నెరవేరుస్తాం గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్!

Nellore: గూడూరు మండలం మంగళూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు తదుపరి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గెలిచిన నెలలోనే పెన్షన్లను పెంచి ప్రతి నెల లబ్ధిదారులకు అందిస్తున్నామని సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు

ప్రభుత్వ కార్యక్రమానికి తాసిల్దార్ అగ్రికల్చరల్ అధికారులు రాకపోవడం పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, లీలావతి, మట్టం శ్రావణి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News