Peddapalli: ప్రజా సంక్షేమమే లక్ష్యం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రజాపాలన జోష్
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో జరిగిన గ్రామసభలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల పాల్గొన్నారు.
Peddapalli: ప్రజా సంక్షేమమే లక్ష్యం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రజాపాలన జోష్
Peddapalli: ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని కాల్వశ్రీరాంపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ లో సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ మాల మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని అన్నారు. 99 రోజుల స్పెషల్ ప్రోగ్రాం క్రింద పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్యశాఖ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్డు భద్రత పై అవగాహన, వ్యవసాయం, మహిళా సంక్షేమం వంటి వివిధ రంగాలపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెంచే విధంగా గ్రామస్తులు చూడాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయిలో తయారుచేసి విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, షూలు, స్టేషనరీ తదితర వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. అనుభవాగ్లైన ఉపాధ్యాయులతో విద్య బోధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ తమ పిల్లను చదివించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, కార్యదర్శి సతీష్ ఆయా శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.