డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ అనూహ్య నిర్ణయం...

Update: 2018-08-09 06:00 GMT

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది... ఇప్పటి వరకు ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతూ వచ్చిన ఆ పార్టీ... ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థికి డిప్యూటీ చైర్మన్ గా అవకాశమిస్తానని తొలుత చెప్పి, ఆపై తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దించిందని, ఆ విషయాన్ని ముందుగా తమతో చర్చింలేదని విజయసాయి ఆరోపించారు. రాష్ట్రంలో శత్రువుల మాదిరిగా ఉంటూ, కేంద్రంలో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని చేతులు కలిపి, కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి సైతం తాము మద్దతు ఇవ్వబోవడం లేదని తెలిపారు.

Similar News