రాజమహేంద్రవరం చేరుకున్న మంత్రి లోకేష్

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు.

Update: 2025-12-19 04:48 GMT

రాజమహేంద్రవరం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. మంత్రి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పలు నూతన భవనాలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు.

అనంతరం 03.30 గంటల నుంచి రాజమండ్రిలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు.

Tags:    

Similar News