‘ఢిల్లీలో పీపీపీకి ‘జై’ కొట్టి.. గల్లీలో ఫేక్ సంతకాల జగన్నాటకం!’

ఢిల్లీలో పీపీపీకి అనుకూలంగా సంతకాలు పెట్టి, గల్లీలో ఫేక్ సంతకాల హడావిడి చేయడం జగన్నాటకం కాదా? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ? అని మాజీ సీఎం జగన్ ని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు.

Update: 2025-12-18 10:42 GMT

మంగళగిరి: ఢిల్లీలో పీపీపీకి అనుకూలంగా సంతకాలు పెట్టి, గల్లీలో ఫేక్ సంతకాల హడావిడి చేయడం జగన్నాటకం కాదా? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ? అని మాజీ సీఎం జగన్ ని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నూతన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం త్వరితగతిన ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. అయితే, ఎప్పటిలాగే ఏ మంచి కార్యక్రమం జరిగినా జగన్ నేతృత్వంలోని రాక్షస మూక అడ్డుపడుతూనే ఉంటుందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎలాంటి మంచి జరగకూడదు, ప్రజలకు ఏ లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్ బాగుండకూడదన్నదే జగన్ ధ్యేయమని పట్టాభి ఆరోపించారు. ప్రజలు బాధపడుతుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతారని, అందుకే ప్రజలే జగన్‌కు ‘సైకో’ అనే బిరుదు ఇచ్చారని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల విషయంలో ఏదో ఘోరం జరిగిపోతోందని, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి విధానం కాదంటూ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని దొంగ సంతకాలు తయారుచేసుకుని గవర్నర్ వద్దకు వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారని విమర్శించారు.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా గవర్నర్‌ను కలవడం పూర్తి ద్వంద్వ వైఖరని అన్నారు. చేసిన పనులు ఒకలా, మాట్లాడేది మరోలా ఉంటోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఇంకో మాట- ఇదే జగన్ నాటకం అని ఎద్దేవా చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు సంబంధించిన 157వ నివేదిక (9-02-2024)ని ప్రస్తావిస్తూ, ఆ కమిటీలో చైర్మన్ భువనేశ్వర్ కలితతో పాటు రాజ్యసభ నుంచి 9 మంది, లోక్‌సభ నుంచి పలువురు సభ్యులున్నారని తెలిపారు. అందులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి కూడా సభ్యుడిగా ఉండి సంతకం చేశారని గుర్తు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత వైద్యుడని, గతంలో తిరుపతి ఎంపీగా పనిచేశారని పేర్కొన్నారు. ఆ నివేదికలో దేశంలో ఎంబీబీయస్ సీట్లు తీవ్రంగా తక్కువగా ఉన్నాయని, నీట్ పరీక్ష రాసేవారి సంఖ్య మాత్రం భారీగా పెరిగిందని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.

2024–25లో సుమారు 1,76,658 ఎంబీబీయస్ సీట్లు ఉంటే, నీట్ పరీక్ష రాసిన వారు 20 లక్షల 38 వేలమందికి పైగా ఉన్నారని, లక్ష సీట్లకు 20 లక్షల మంది పోటీ పడుతున్నారని కమిటీనే గ్రాఫ్‌లతో వివరించిందన్నారు. పీజీ సీట్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని తెలిపారు. ఇదే నివేదికలో మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించాలని, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌నే ఉత్తమ మోడల్‌గా పేర్కొంటూ రికమెండేషన్ 12లో స్పష్టంగా సూచించారని అన్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన వ్యక్తిగత వైద్యుడే ఢిల్లీలో పీపీపీకి అనుకూలంగా సంతకం పెట్టారని పట్టాభి గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు గవర్నర్ వద్దకు వెళ్లి పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News