కోటి సంతకాల ఉద్యమం సక్సెస్‌ :వైఎస్ జగన్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సక్సెస్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Update: 2025-12-18 10:27 GMT

తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సక్సెస్‌ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, సీనియర్‌ నేతలతో ఆయన ఈరోజు సమావేశం అయ్యారు. ఈ ఉద్యమం గ్రాండ్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.

‘‘ఇక్కడి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ అంకితభావంతో పని చేశారు. ఇలాగే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి, ప్రభుత్వం మెడలు వంచేలా మనం పని చేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.’’ అని చెప్పారు.

లక్ష్యాన్ని మించి సంతకాలు

ప్రజా ఉద్యమంలో లక్ష్యాన్ని మించి ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించినట్లు మాజీ సీఎం జగన్ చెప్పారు. అవి ఇప్పటికే లోక్‌భవన్‌ చేరాయని, అక్కడి సిబ్బంది వాటిని పరిశీలించారు కూడా నింద కలెక్టర్లపై మోపుతున్నారన్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. చంద్రబాబు గ్రాఫ్‌ పడిపోతోందని చెప్పారు. ఎందుకంటే, ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదన్నారు. మార్చి వస్తే, మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టారు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదని విమర్శించారు.

మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్‌ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశామని, వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదని మండిపడ్డారు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారని, సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ లేవు, వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ మోసాలేనని ధ్వజమెత్తారు. 

Tags:    

Similar News