గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కట్టుదిట్టమైన ప్రణాళికలు
2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటి నుండే కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు.
అమరావతి:2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటి నుండే కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి మొదటి ప్రాథమిక సమావేశం కావున ఇప్పటి నుండే తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా జిల్లాల వారీగా, స్నాన ఘట్టాల వారీగా, శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మైక్రో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. 2015 కంటే 2027 పుష్కరాలకు రెట్టింపు స్థాయిలో భక్తులు పాల్గోనే అవకాశం వున్నందున, అందుకనుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. ఇంకా వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు.
ఈ సమావేశంలో గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, ఆ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే, వర్చువల్ గా ముఖ్య కార్యదర్శులు ఎస్ సురేష్ కుమార్, శశి భూషణ్ కుమార్,ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావు, శాంతి భద్రతల ఏడీజీ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ ఐ అండ్ పీఆర్ కెఎస్.విశ్వనాధన్, ఎండి ఎపిటిడిసి ఆమ్రపాలి, ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇత అధికారులు పాల్గొన్నారు.