నేడు ఆరుగురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్లపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమై చర్చిస్తారు.

Update: 2025-12-19 05:02 GMT

అమరావతి: ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్ట్లపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమై చర్చిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

▪️ఉదయం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో శ్రమ శక్తి భవన్ లో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

▪️ఉదయం 10 గంటల 45 నిమిషాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశం అవుతారు.

▪️కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పార్లమెంట్ లో సమావేశమై చర్చిస్తారు.

▪️అనంతరం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో పార్లమెంట్లోనే భేటీ అవుతారు.

▪️మధ్యాహ్నం 2.15 నిమిషాలకు క్రెడాయ్ సమా వేశానికి హాజరై ప్రసంగిస్తారు.

▪️సాయంత్రం నాలుగు గంటలకు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతోనూ సమావేశం అవుతారు.

▪️సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సమావేశమై, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సుధీర్ఘంగా చర్చిస్తారు.

Tags:    

Similar News