పుట్టిన గడ్డనే అభివృద్ధి చేయని చంద్రబాబు

Update: 2018-01-14 06:38 GMT

సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రవాసాంధ్రులు సైతం తాము పుట్టిన గడ్డపై మక్కువతో అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు చదివిన శేషాపురం పాఠశాల తోస్తే పడిపోయే స్థితిలో ఉందన్నారు. చంద్రగిరిలో 100 పడకల ఆసుపత్రి అభి వృద్ధికి వైఎస్‌ జారీ చేసినప్పటికీ అదెలాంటి అభి వృద్ధికి నోచుకోకపోవడం చంద్రబాబు చిత్తశుద్ధిని తెలి యజేస్తోందన్నారు. పాలు, నీరు ఒకే ధర పలకడానికి కారణం హెరిటేజ్‌ డెయిరీనే అన్నారు. రైతు కుటుం బంలో పుట్టిన చంద్రబాబు నల్లబెల్లంపై ఆంక్షలు వి ధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నాలు గేళ్ళపాటు పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ళ నిర్మాణాలు ఊసెత్తని చంద్రబాబుకు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అవన్నీ గుర్తుకొచ్చాయన్నారు. రాజకీయ ప్రక్షాళనకే తాను పాదయాత్ర చేస్తున్నానన్న జగన్‌ ప్రజలు దయ తలిస్తే ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్‌ కంటే రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 

Similar News