16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వణికిపోతున్న కర్నూలు జిల్లా
16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వణికిపోతున్న కర్నూలు జిల్లా కర్నూలు: కర్నూలు జిల్లా చలితో గజగజ వణికిపోతోంది.జిల్లా వ్యాప్తంగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది. ప్రజలు చర్మ వాధులకు గురవుతున్నారు. రెండు, మూడు రోజులుగా సాయంత్రం 5 గంటల నుంచే పొగ మంచు కమ్ముకుంటుంది. ఉదయం సూర్యుడు కనిపించి ఎండ కాస్తున్నా 11 గంటల వరకూ చలి తీవ్రత తగ్గడంలేదు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండల ప్రజలు చలితో అల్లాడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సాయంత్రం నుంచే చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి కూడా జంకుతున్నారు. దీంతో వివిధ వర్గాల కార్మికులు, రైతులు ఉదయం పనులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాయంత్రం 6 గంటల తర్వాత చలి ప్రారంభమై, ఉదయం 8 గంటల వరకు మంచు కప్పేస్తుంది.పొగమంచు కూడా ఎక్కువగా ఉండి వాహనాల రాకపోకలకు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. రానురాను చలి ఇంకా పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు: కర్నూలు జిల్లా చలితో గజగజ వణికిపోతోంది.జిల్లా వ్యాప్తంగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది. ప్రజలు చర్మ వాధులకు గురవుతున్నారు. రెండు, మూడు రోజులుగా సాయంత్రం 5 గంటల నుంచే పొగ మంచు కమ్ముకుంటుంది. ఉదయం సూర్యుడు కనిపించి ఎండ కాస్తున్నా 11 గంటల వరకూ చలి తీవ్రత తగ్గడంలేదు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండల ప్రజలు చలితో అల్లాడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
సాయంత్రం నుంచే చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి కూడా జంకుతున్నారు. దీంతో వివిధ వర్గాల కార్మికులు, రైతులు ఉదయం పనులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాయంత్రం 6 గంటల తర్వాత చలి ప్రారంభమై, ఉదయం 8 గంటల వరకు మంచు కప్పేస్తుంది.పొగమంచు కూడా ఎక్కువగా ఉండి వాహనాల రాకపోకలకు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. రానురాను చలి ఇంకా పెరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.