చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు పేల్చిన జగన్‌‌

Update: 2018-06-05 14:06 GMT

తన చేతికి గడియారం ఉండదు... వేలికి ఉంగరం ఉండదు.... మెడలో బంగారు గొలుసు ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై... వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. వేలికి ఉంగరం, మెడలో గోల్డ్‌ చైన్‌ ఉండదు కానీ... రెండెకరాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆస్తి మాత్రం సంపాదించారని అన్నారు. చంద్రబాబు చేతికి గడియారం ఉండదు కానీ వేలకోట్ల హెరిటేజ్‌ కంపెనీ... రాజభవనంలాంటి ఇల్లు... ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల నల్లధనం మాత్రం ఉన్నాయన్నారు. అమ్మాయిల వంక చూడనంటూ... 70ఏళ్ల వయసులో చంద్రబాబు చెప్పడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. చంద్రబాబు మద్యం తాగరు కానీ... జనాన్ని మాత్రం తాగుబోతుల్ని చేస్తారంటూ కథ చెప్పుకొచ్చారు జగన్‌. 

Similar News