పీవీ సింధుకి కేసీఆర్ సర్కారు షాక్.!

Update: 2018-07-13 05:58 GMT

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తనకు అదనంగా స్థలం ఇవ్వాలని కోరిన విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చిది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పీవీ సింధుకు అప్పట్లోనే తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ భరణి లేఅవుట్‌లో దాదాపు రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలంతో పాటు రూ.5 కోట్ల నగదును ఆమెకు అందజేసింది. అయితే.. తనకు ఇచ్చిన భూమి పక్కనే ఉన్న 398 గజాల స్థలం కూడా కావాలంటూ ఆమె కొన్నాళ్ల క్రితం సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆమె విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థలం, నగదు బహుమతితో పాటు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని కూడా ఇచ్చింది. రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలు పొందిన నేపథ్యంలో ఆమెకు అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం కార్యాలయం భావించినట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవలే వాయిదా పడిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చాలని నిర్ణయించగా... సీఎం కార్యాలయం ఆదేశాలతో ఫైలును పక్కనపెట్టేశారు.

Similar News