పవన్‌ వైపు పలువురు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నేతల చూపు...అధికార టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు...

Update: 2018-10-16 04:35 GMT

ప్రజా పోరాట యాత్రతో జోరు పెంచిన జనసేనాని పవన్ కల్యాణ్‌ మరోపక్క పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు‌. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం క్లీన్ ఇమేజ్‌ ఉన్న సీనియర్లను పార్టీలోకి తీసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కీలక నేతల వలసలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పవన్‌ త్వరలోనే మరికొందర్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జనసేనాని పవన్ కల్యాణ్‌ పార్టీ బలోపేతంపై మరింత దృష్టిపెట్టారు. ముఖ్యంగా సీనియర్‌ లీడర్లను పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్‌ పెట్టారు. పీఆర్పీలో పనిచేసిన నేతలు, టీడీపీ, వైసీపీల్లో టికెట్లు దక్కవన్న అనుమానమున్న లీడర్లు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలామంది కాంగ్రెస్‌ నేతలు పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. జనసేన వైపు చూస్తున్న నేతల్లో ఎక్కువమంది కాంగ్రెస్‌ మాజీలే ఉన్నట్లు తెలుస్తోంది. హర్షకుమార్‌, ఉండవల్లి, వట్టి వసంత్‌‌కుమార్‌, కొణతాల రామకృష్ణ వంటి నేతలు జనసేన వైపు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు జనసేనలో చేరగా, చలమలశెట్టి సునీల్‌ కూడా త్వరలోనే పవన్‌ చెంతకు చేరనున్నారు. ఇక అధికార టీడీపీ నుంచి ఐదుగురు కాపు ఎమ్మెల్యేలు పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వీళ్లంతా జనసేనలో చేరేందుకు పవన్‌‌తో మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. అయితే పీఆర్పీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్తవారిని పార్టీలో చేర్చుకునే విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News