గిరిజనులతో పవన్ కల్యాణ్‌ సమావేశం

Update: 2018-11-04 11:38 GMT

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ లాటరైట్‌ మైనింగ్‌ ప్రాంతంలో జనసేనాని పర్యటించారు. సముద్ర మట్టానికి 860 అడుగుల ఎత్తులో ఉండే వంతాడ గ్రామానికి భారీ భద్రత మధ్య చేరుకున్న పవన్ కల్యాణ్‌ గిరిజనులతో సమావేశమై లాటరైట్‌ మైనింగ్‌‌ పరిస్థితులను పరిశీలించారు. పవన్ కల్యాణ్‌ అధికారిక ఫేస్‌ బుక్‌ పేజ్‌ నుంచి లైవ్‌లో మాట్లాడిన జనసేనాని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మైనింగ్‌ జరుగుతుంటే గిరిజనులకు, స్థానికులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సహజ సంపదను దోచుకుంటుంటే కళ్లప్పగించి చూస్తారా? ఇదేనా రియల్ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే అంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే పారదర్శకత అంటూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌. మైనింగ్‌‌ను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వానికి సిగ్గు ఉండాలన్నారు.

Similar News