పవన్ సైలెన్స్ వెనకున్న రీజనేంటి.?

Update: 2018-03-22 03:38 GMT

అవిశ్వాసం మీరు పెట్టండి.. ఆ తర్వాత నాకొదిలేయండి.. మద్దతు నేను కూడగడతా. కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన మాట ఇది. అలాంటిది.. పార్లమెంటులో నో కాన్ఫిడెన్స్‌పై రచ్చ జరుగుతున్నా.. జనసేనాని నోరు మెదపడం లేదు. 4 రోజులుగా సభ వాయిదా పడుతున్నా.. అస్సలు స్పందించడం లేదు. ఇంతకీ పవన్ సైలెన్స్ వెనుకున్న రీజన్ ఏంటి.?

నాలుగేళ్ల తర్వాత మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం అనగానే దేశమొత్తం ఏపీ వైపు చూస్తోంది. అందుకు కారణం ఏపీకి స్పెషల్ స్టేటస్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం నో కాన్ఫిడెన్స్ పైనే హాట్ టాపిక్. రోజూ పార్లమెంట్ ప్రారంభమయ్యే సమయానికి అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు 4 రోజులుగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబడుతున్నారు. తమకు సొంతంగా బలం లేకపోయినా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి మరీ నో కాన్ఫిడెన్స్‌ కోసం పోరాడుతున్నాయి. కానీ అక్కడ సభ వాయిదా పడటం ఒక్కటే కరెక్ట్‌గా జరుగుతోంది.

ఇదంతా కాసేపు పక్కనబెడితే జనసేనాని తీరే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పార్లమెంటు సమావేశాలకు ముందు జగన్ సవాల్‌ను స్వీకరిస్తూ అవిశ్వాసానికి నేను మద్దతు కూడగడతానన్న పవన్ సడన్‌గా ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయారన్నది చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఐనా పవన్ కల్యాణ్ మాత్రం నో కాన్ఫిడెన్స్‌పై కనీసం ట్వీట్ కూడా చేయడం లేదు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన పవన్ కల్యాణ్ లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏపీ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తా ఏమైనా చేస్తా అన్న పవన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎందుకు మాట్లాడటం లేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రాన్ని నిలదీసేందుకు పవన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇటు విపక్షాలు కూడా పవన్‌ తీరుపై మండిపడుతున్నాయి. జనసేనాని పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ విమర్శిస్తున్నాయి.

Similar News