ఏపీ దేవాలయాల్లో క్షురకుల ఆందోళన

Update: 2018-06-15 05:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నాయి బ్రాహ్మణులు ఆందోళన బాట పట్టారు. తిరుమల మినహా.. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులంతా.. నిరసనకు దిగారు. కనీసం వేతనం 15 వేలకు పెంచాలని.. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలనే డిమాండ్లతో.. కత్తి డౌన్ పేరుతో.. విధులను బహిష్కరించారు. అన్నవరం, విజయవాడ, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకా తిరుమల తో పాటు.. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులంతా.. ఆందోళన చేపట్టడంతో.. కేశ ఖండన శాలలు బోసిపోయాయి. ఇటు తలనీలాలు దేవుడికి సమర్పించడంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన ఆపబోమని.. స్పష్టం చేస్తున్నారు. 

Similar News