కంటతడి పెట్టిన జోగిని శ్యామల.. ఏడుస్తూ శాపనార్థాలు

Update: 2018-07-30 06:15 GMT

బోనాల జాతరలో జోగిని శ్యామల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఏటా హైదరాబాద్‌లో జరిగే గోల్కోండ, లష్కర్ బోనాల్లో పాల్గొని బోనమెత్తి ఆడతారు. అమ్మవారిపై ఎంతో భక్తితో ఆడిపాడే శ్యామల ఈసారి లష్కర్ బోనాలలో మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) జాతరను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చిన తన బాధను వెలిబుచ్చుకున్నారు. మహిళలను కించపరిస్తే పుట్టగతులు ఉండవని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు మహిళల ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు ఒక్కొక్కరు దాదాపు 10 కిలోల బరువు బోనంతో లైనులో నిల్చున్నారని, అయినా అవేమీ పట్టించుకోకుండా వీఐపీలు వస్తున్నారంటూ గంటల తరబడి భక్తుల క్యూలైన్లను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుస్తూ శాపనార్థాలు పెట్టారు. వీఐపీలు వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాటకు కొందరు మహిళలు కూడా కంటతడి పెట్టారు. అమ్మవారిని దర్శించుకోకుండా వెనుదిరిగారు.
 

Similar News