మరోసారి తప్పులో కాలేసిన చంద్రబాబు

Update: 2018-03-31 09:55 GMT

నోరు జారడంలో తన తనయుడు నారా లోకేశ్‌ను మించిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం కడపలోని ఒంటిమిట్టలో జరిగిన కోదండరామస్వామి కల్యాణానికి సతీసమేతంగా వెళ్లిన చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.  అయితే, చంద్రబాబు బమ్మెర పోతన విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. ఆయన రామాయణాన్ని రచించలేదు. ఈ నేపథ్యంలో భాగవతం రాసిన పోతనను రామాయణం రాశారని చంద్రబాబు పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. ఇది చంద్రబాబుకు ఉన్న జ్ఞానం అని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
 
  

Similar News