మహానాడులో అమిత్‌షాకు చంద్రబాబు కౌంటర్

Update: 2018-05-28 07:57 GMT

నమ్మకం ద్రోహం చేసిన పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరముందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణానికి కేవలం 15వందల కోట్లు మాత్రమే ఇచ్చారన్న చంద్రబాబు....అందుకు సంబంధించిన 15వందల 9 కోట్ల బిల్లుల పంపామన్నారు.  నిజమైన యూసీలు పంపలేదన్న బీజేపీ నేతలకు.... స్వీయ ధృవపత్రాలేమీ పంపలేదని అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ హక్కన్న చంద్రబాబు...ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 
 
అసలు యూసీలు అడిగే అర్హత అమిత్‌ షాకి ఎక్కడిదని నిలదీశారు. యూసీల గురించి అడగాలనుకుంటే ప్రధాని అడగాలన్నారు. పాలనా వ్యవహారాల్లో బీజేపీ అధ్యక్షుడు తలదూర్చడం సరికాదని చంద్రబాబు హితవుపలికారు. తెలుగు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్‌కు ఎలా తరలిస్తారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను వాడుకుంటూ టీడీపీపై దాడి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తమకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. 22 కోట్ల మంది సెల్‌ నెంబర్లు ఉంటే పాలనకు వినియోగించుకోవాలి కానీ బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు.

Similar News