YCP MP Raghurama Krishna Raju Sensational Comments : ఏపీ సీఎం కోర్టు తీర్పులను అమలుపరచడం నేటి నుంచి పాటించాలి : ఎంపీ రఘురామ

Update: 2020-07-24 09:13 GMT
Raghu ramakrishna raju

YCP MP Raghurama Krishna Raju Sensational Comments : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు యధాతదంగా.. మా పార్టీ సిద్ధాంతం కూడా కోర్టులను గౌరవించడమే. మా పార్టీలో అపార్థం చేసుకునే వారు ఎక్కువ, గవర్నర్ ఆదేశాల తరువాత కూడా కోర్టు తీర్పును పాటించకపోవడం దారుణమైన విషయం. గవర్నర్ ఆదేశాల ను పాటించకుండా ఆర్టికల్ 356 ను కొనితెచ్చుకోవద్దు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరువాత అయిన రాష్ట్రప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలి. ఏపి సీఎం కోర్టు తీర్పులను అమలుపరచడం నేటి నుండి పాటించాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపి ప్రభుత్వం కోర్టును తాము తీసుకున్న నిర్ణయం విషయంలో సంతృప్తి పరిస్తే బాగుండేది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఒక ఏపి పౌరుడిగా గౌరవిస్తున్నాను. నేను, 99 శాతం ప్రజలు ఊహించిన తీర్పు ఇదే.

ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఎన్నోసార్లు కోర్టులు గుర్తు చేస్తున్నా, ఎందుకనో కొంతమంది వ్యక్తులు ఆ భాధ్యతను మరచిపోవడం జరుగుతుంది. అత్యంత హేయమైన పదజాలంతో కొంతమంది న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారు, వారు ఎవరో అందరికి తెలుసు. కొంతమంది పెద్దలు సోషల్ మీడియా కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఉండవచ్చు , కాని ప్రభుత్వాలు విమర్శలు స్వీకరించి సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు 175 అసెంబ్లీ స్థానాలు వచ్చినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి వీలులేదు. మన పార్టీకి 51 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి, 100 శాతం మంది ప్రజలు ఓటువేసినా న్యాయవ్యవస్థ ను మనము ఏమీ చేయలేము. ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం . సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను గౌరవించి ముందుకు వెళ్లామని ప్రభుత్వానికి సూచన ప్రజాస్వామ్య విరుద్ధ, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు తీసుకోవద్దు. రమేష్ కుమార్ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన నిర్ణయం ఈ రోజు సరియైనదే అని నిరూపితమైంది. కరోనా తో సహజీవనం, పారాసిటామాల్ వేసుకోవాలన్న సీఎం నిర్ణయాన్ని ప్రజలు గౌరవించారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు సహజీవనం చేస్తే రానున్న 4 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కూడా ఆరోగ్య శ్రీ పథకానికి సరిపోదు. సీఎం మాస్క్ ధరిస్తే మంచిది, ఆయన ధరిస్తే రాష్ట్ర ప్రజలందరూ పాటిస్తారు. సహజీవనం లాంటి విషయాలను పక్కనపెట్టి ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదనే భావనను తొలగిద్దాం. గవర్నర్ నిర్ణయానికి నిన్న విలువ ఇవ్వకపోయిన సుప్రీంకోర్టు తీర్పు తరవాతయినా ఇస్తే మంచిది అని అన్నారు.

Tags:    

Similar News