పాలకులారా.. మా భవిష్యత్ ఏంటి ? అంటూ రైతుల పిల్లలు ప్రశ్న

Update: 2019-12-21 07:34 GMT

మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి అట్టుడుకుతోంది. పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. అమరావతిలోనే రాజధానిని కొసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మందడంలో రైతుల దీక్ష కొనసాగుతోంది. కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. చిన్న పిల్లలు కూడా నిరసనలో పాల్గొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వలేదని ప్రజలు, ప్రభుత్వం కోసమే ఇచ్చామని రైతులు తెలిపారు. తమకు అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకులారా మా భవిష్యత్ ఏంటి ? అంటూ అమరావతి రాజధాని రైతులు పిల్లలు ప్రశ‌నిస్తున్నారు. తమ బంగారు భవిష్యత్ కోసం భూములు ఇస్తే రాజధాని తరలించి అన్యాయం చేస్తారా ? అంటూ నిరసలకు దిగారు. తుళ్లూరు దగ్గర నిర్వహిస్తున్న రైతుల దీక్షలో భూమిలిచ్చిన కుటుంబాల పిల్లలు కూడా నిరసనకు దిగారు. తమకు అన్యాయం చేయవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.  

Tags:    

Similar News