Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు

Bhumana Karunakar Reddy: టీటీడీకి చెందిన అత్యంత విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెట్టడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు.

Update: 2025-12-17 12:31 GMT

Bhumana Karunakar Reddy: టీటీడీకి చెందిన అత్యంత విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెట్టడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. ఇది సాక్షాత్తు ఆ శ్రీవారికే పెడుతున్న మూడు నామాలని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని.. మూడు వేల కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెడుతూ జీవో ఇచ్చి 4 రోజులు దాటుతున్నా.. ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదు అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా వదలడం లేదని స్వామీజీలు, పీఠాధిపతులు తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై నోరు విప్పాలని భూమన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News