సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్

‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎకనమిక్ టైమ్స్ ఎంపిక చేసింది. అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

Update: 2025-12-18 09:50 GMT

అమరావతి: ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎకనమిక్ టైమ్స్ ఎంపిక చేసింది. అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు 2025లో చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో చేసిన కృషి ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. 18 నెలల్లో రూ. 10.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించినందుకు ఎకనామిక్ టైమ్స్ (ET) ఈ అరుదైన గౌరవం అందించింది.


చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం అని మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. రాష్ట్రానికి, తమ కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకకు ఈ అవార్డు నిదర్శనం అని లోకేష్‌ అన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసినవారిలో మంత్రులు అచ్చెన్నాయుడు,పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, ఎన్.ఎం.డి. ఫరూక్ తదితరులు ఉన్నారు.  

Tags:    

Similar News