తిరుపతి, మచిలీపట్నంల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈరోజు, రేపు నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే (South Central Railway) ప్రకటించింది.

Update: 2025-12-18 04:54 GMT

హైదరాబాద్‌ : క్రిస్టమస్ సెలవులు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈరోజు, రేపు నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైలు (07296 నెంబర్‌) శుక్రవారం రాత్రి 7.40గంటలకు తిరుపతిలో బయల్దేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి మీదుగా శనివారం ఉదయం 9.30 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.

మరో ప్రత్యేక రైలు (07297 నెంబర్‌) గురువారం రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

Tags:    

Similar News