Vijayawada Hotels in Troubles: ఒక పక్క కరోనా.. మరోపక్క రాజధాని మార్పు.. చావు దెబ్బ తిన్న విజయవాడ హోటల్స్!

Update: 2020-08-01 08:50 GMT

Vijayawada Hotels in Troubles: ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో స్టార్ హోటళ్లన్నీ వెలవెలబోతున్నాయి. దానికి ప్రధాన కారణం కరోనా ఐనప్పటికీ మరో కారణంతో హోటళ్ల వ్యాపారం కుదేలైంది. కరోనా ప్రభావంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకీ పరిస్థితి ఏర్పడిందో ఈ ప్రత్యేక కథనంలో చూడండి.

లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా మూసుకుపోయిన మాల్స్, హోటల్స్ కఠిన నిబంధనలతో తిరిగి తెరుచుకున్నాయి. ఇండియా మొత్తం వీటి వ్యాపార లావాదేవీలు ఓ లా ఉంటే ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో మాత్రం రివర్స్ గా ఉంది. కరోనా భయంతో జనం ప్రయాణాలు మానుకోగా రాజధాని మార్పు నేపథ్యంలో విజయవాడకు వచ్చీపోయే జనం తగ్గిపోయారు. ఈ ప్రకటన వెల్లడించిన తరువాత స్టార్ హోటళ్ల దగ్గర నుంచి కాస్త సుమారుగా ఉండే హోటల్స్ వరకు యాత్రికులు, వ్యాపార లావాదేవీల నిమిత్తం వచ్చేవారు లేక బోసిపోతున్నాయి.

గతంలో రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ కార్యకలాపాలపై దేశవిదేశాల నుంచి వ్యాపారవేత్తలు, యాత్రికులు రాజధాని చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు రాజధాని మార్పు ప్రకటన హోటళ్ళు, రెస్టారెంట్ రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో పాటు కరోనా ఎఫెక్ట్ కూడా ఈ రంగాన్ని కుదేలు చేసేసింది. ఒకప్పుడు 80 నుంచి 90 శాతం అక్యూపెన్సీ ఉండే రెస్టారెంట్లు కూడా ఇప్పుడు 10 నుంచి 18 శాతానికి పడిపోయింది. కోవిడ్ కు మెడిసిన్ అందుబాటులోకి వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఓ రెస్టారెంట్ ప్రతినిధి చెబుతున్నారు.

మొత్తానికి ఏపీ వాణిజ్య రాజధానిలో ఓవైపు కరోనా మరోవైపు రాజధాని తరలింపు ఎఫెక్ట్ హోటళ్లు, రెస్టారెంట్లపై బాగా ప్రభావం చూపించింది. కరోనాకు మందు వస్తే గానీ మళ్లీ ఈ రంగం పుంజుకునే అవకాశాలు లేవు. అప్పటి వరకు ఈ రంగం నిస్తేజంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News