స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవ్వాలని మాజీ రాష్ట్ర ఎంపీపీ ల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపిపి వినోద్ రాజు పిలుపునిచ్చారు.

Update: 2020-01-12 10:47 GMT

ఎస్.రాయవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవ్వాలని మాజీ రాష్ట్ర ఎంపీపీ ల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపిపి వినోద్ రాజు పిలుపునిచ్చారు. మండలం పెదగుమ్ములూరులో మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్.వెంకటరాజు ఆధ్యక్షతన ఆ పార్టీ నాయకులతో ఆదివారం మద్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ రాజు మాట్లాడుతూ...రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్ధులను ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో చర్చించి అభ్యర్ధులను సూచించాలని అన్నారు.

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను, దిశ-దశ లేని జగన్ పరిపాలనను విస్త్రతంగా ప్రజలకు వివరించాలన్నారు. విజయమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరాజు అన్నారు. క్రమ శిక్షణ గల పార్టీగా పేరున్న టీడీపీని, అదే మంచి పేరుతో ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్ధిని గుర్తించడమే కీలకమని, సరియైన అభ్యర్ధిని సూచించడంతోనే సగం గెలుపును సాధించినట్లవుతుందని అన్నారు.

Tags:    

Similar News