కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా పదవీ విరమణ వేడుక

Kurnool: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ CSRMO డాక్టర్ హేమనలిని పదవీ విరమణ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.

Update: 2026-03-31 15:37 GMT

కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా పదవీ విరమణ వేడుక

Kurnool: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ CSRMO డాక్టర్ హేమనలిని గారిని మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మర్యాదపూర్వకముగా కలిసి అభినందించిన కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ DR K. వెంకటేశ్వర్లు గారు.

ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, బహుమతి ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆమె శేష జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా గడవాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో పాటు అడ్మినిస్ట్రేషన్ నుండి Dr వెంకటరమణ గారు, Dr శివ బాల గారు, DR సునీల్ ప్రశాంత్ గారు పాల్గొన్నారు.

Tags:    

Similar News