Emmiganur: రాయలసీమ ప్రాజెక్టులపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కీలక సూచనలు

Emmiganur: ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-03-31 15:48 GMT

Emmiganur: రాయలసీమ ప్రాజెక్టులపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కీలక సూచనలు

Emmiganur: ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (HNSS) ప్రాజెక్టు విజయవంతంగా అమలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా రాయలసీమలో దీర్ఘకాలంగా ఉన్న నీటి సమస్య కొంతవరకు పరిష్కారం దిశగా అడుగులు పడినట్లు పేర్కొన్నారు.

అలాగే ఎల్‌ఎల్‌సీ (LLC) మోడర్నైజేషన్ పనులు చేపడితే మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో త్రాగునీటి సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని సూచించారు. ఆర్డీఎస్ (RDS), గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేస్తే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో సాగునీటి కొరత పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు.

జల జీవన్ మిషన్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులను పూర్తి స్థాయిలో చేపట్టి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం ద్వారా పేదలకు సొంతిల్లు కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు సాగునీరు సమృద్ధిగా అందిస్తే వలసలు గణనీయంగా తగ్గి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు

Tags:    

Similar News