Udayagiri: రీ-సర్వే పాపాలు.. రైతులకు శాపాలు.. రైతు సంఘం ధర్నా
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతుల పోరుబాట. అసైన్మెంట్ పట్టాల రద్దు, రీ-సర్వే అవకతవకలపై కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన.
Udayagiri: రీ-సర్వే పాపాలు.. రైతులకు శాపాలు.. రైతు సంఘం ధర్నా
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి అసైన్మెంట్ పట్టాల రద్దు చేయడంపై సమగ్ర విచారణ చేపట్టాలని, రైతులకు రైతు భరోసా అందేలా చూడాలని ఉదయగిరి రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ-సర్వేలో జరిగిన అవకతవకల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ చాలా మందికి వన్ బి అడంగల్ ఇవ్వలేకపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు పంపిణీ చేసిన భూములకు కూడా వెంటనే వన్ బి అడంగల్ జారీ చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాల నాయకుడు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో సచివాలయాల ఎదుట రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.