Nandyala: మానవత్వానికి నిదర్శనం దండే సోదరుల సేవలు

Nandyala: నంద్యాల జిల్లా ఎం. కృష్ణాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి సేవలను మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ కొనియాడారు.

Update: 2026-03-31 16:41 GMT

Nandyala: మానవత్వానికి నిదర్శనం దండే సోదరుల సేవలు

Nandyala: నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం ఎం. కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి సేవలను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రశంసించారు. మంగళవారం నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి వారు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.

ఇటీవల పీజీఆర్ఎస్ హాల్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన దండే సోదరులు, గ్రామంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. వారి కృషిని జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మరియు మంత్రి ఫరూక్ ప్రత్యేకంగా కొనియాడారు.

దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామంలో నీటి కొరత నివారణకు చర్యలు తీసుకుని ప్రతి ఇంటికి శుద్ధ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.పింఛన్లు అందని నిరుపేదలకు స్వంత నిధులతో నెలకు రూ. 2,000 సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

పేద కుటుంబాల్లో అంత్యక్రియలకు రూ. 5,000, వివాహాలకు రూ. 10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఒంటరి వృద్ధులకు భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు..నిరుద్యోగ యువతకు నగరాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తున్నామని వివరించారు.ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ప్రారంభమైన P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) భావనను ఎం. కృష్ణాపురం గ్రామంలో దండే సోదరులు ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వంత నిధులతో పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. పింఛన్లు అందని వారికి సహాయం, విద్యార్థుల ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలు వారి మానవత్వానికి నిదర్శనమన్నారు..ఇలాంటి సేవా భావం ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News