Ayyagaripalem: రైతులపై కక్షతోనే 22A ఆంక్షలు.. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ayyagaripalem: పొదలకూరు అభివృద్ధిలో కాకాణి బ్రాండ్ శూన్యమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
Ayyagaripalem: రైతులపై కక్షతోనే 22A ఆంక్షలు.. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ayyagaripalem: పొదలకూరు అభివృద్ధిలో కాకాణి బ్రాండ్ శూన్యమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు, పొదలకూరు మండలం అయ్యగారి పాలెం పర్యటించారు, ముందుగా గ్రామస్థుల దశాబద్దాల సమస్య అయిన స్మశాన దారి కి సొంత నిధులతో భూమి కొనుగోలు చేసిన సర్పంచ్ఈ కండె వసంతమ్మ, నరసయ్యలను అభినందించారు, అనంతరం స్మశానానికి 4,76లక్షల రూపాయలతో వేసిన గ్రావెల్ఈ రోడ్డు 5 లక్షల రూపాయలతో వేసిన సిమెంట్ రోడ్డు, రెండు గోకులాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు విలువైన భూముల దోపిడీలోనే గోవర్ధన్ రెడ్డి తన మార్క్ చూపించారని,రైతులపై కక్షకట్టి ఊళ్లకు ఊళ్ల భూములను 22ఏలో పెట్టించడం ఆయన నైజమన్నారు,పొదలకూరు మండలంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను మేం పరిష్కరించామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నమ్మన్నారు, నాకు ఓటు వేయకపోయినా తోడేరు గ్రామస్థులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు, ఎన్నికల్లో ఓడిపోయినా నేను ఏ రోజూ పారిపోలేదని అధికారంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజలకోసం పోరాడుతున్నాని అన్నారు,
కూటమి ప్రభుత్వం వచ్చాక చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందన్నారు,సంక్షేమ పథకాల ద్వారా ఒక్క అయ్యగారిపాళెం గ్రామస్థులకు ఏడాదికి రూ.1.20 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు, మా హయాంలో గ్రామగ్రామాన కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే వైసీపీ హయాంలో అదే స్థాయిలో భూకుంభకోణాలు, దోపిడీలు జరిగాయన్నారు,
రామదాసుకండ్రిగలో 57 ఎకరాలను రాత్రికి రాత్రి అల్లుడి పేరుతో బదలాయించారన్నారు, మరుపూరులో 57 ఎకరాలను కోటీశ్వరుల కుటుంబానికి దారాదత్తం చేశాడన్నారు,ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.